
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: జర్నలిస్ట్ రంజిత్ పైన, తెలంగాణ జర్నలిస్ట్ లపైన సినీ నటుడు మోహన్ బాబు చేసిన దాడినీ తీవ్రంగా ఖండిస్తున్నామని ఆమ్ ఆద్మీ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి దోనికేనా పూర్ణ చందర్ గౌడ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. Tv9 జర్నలిస్ట్ రంజిత్ పైన 78 సంవత్సరాలు ఉన్న మోహన్ బాబు దాడి చేయటం హెయమైన చర్య అని, సినీ ఇండస్ట్రీలో పెద్దమనిషిల చలామణి అవుతున్న మోహన్ బాబు, విచక్షణ కోల్పోయి జర్నలిస్ట్ ల పైన దాడి చేయటం ఈ సమాజం తల దించుకునే చర్య అన్నారు. ఆంధ్రలో ఏ పార్టీ అధికారంలో ఉంటే వారిని ప్రసన్నం చేసుకొని వందల కోట్లు పోగుచేసుకున్న మోహన్ బాబు, నేను ఏది చేసిన చెల్లుతుంది అని, డబ్బు అహంకారంతో ఒక అయ్యప్ప దీక్ష లో ఉన్న రంజిత్ అనే జర్నలిస్ట్ పైన దాడి చేయటం సిగ్గుమాలిన చర్య అన్నారు. తక్షణమే నిధితుణ్ణి ఎలాంటి ప్రలోబాలకు లొంగకుండా అరెస్ట్ చేయాలని, దీనిపైన సినీ పరిశ్రమ, మా అసోసియేషన్ స్పందించకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ తరపున తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుందని పూర్ణ చందర్ గౌడ్ హెచ్చరించారు.






