
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలంలోని పోతిరెడ్డిపేట గ్రామములో నివసిస్తున్న ముస్లింలు మరణించిన వారిని ఖననం (బొంద) పెట్టడానికి స్థలము కావాలని అక్కడి ముస్లిం సోదరులు పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ తాడికొండ పుల్లాచారి, సభ్యులు అందరూ కలిసి తేదీ. 20- 6- 2019 రోజున పోతిరెడ్డిపేట గ్రామపంచాయతీలో ఒక తీర్మానం చేస్తూ గ్రామానికి చెందిన ప్రజలందరూ సంపూర్ణముగా మద్దతిస్తూ పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన ముస్లిం సోదరులు మరణించిన వారిని ఖననం బొంద పెట్టడానికి స్థలము డిబిఎం 15 ఎస్ ఆర్ఎస్ పి కెనాల్ పోతిరెడ్డిపేట శివారులో గల ఎస్సార్ఎస్పీ కెనాల్ అపోషన్లో రెండు కాలువల మధ్య సర్కారు భూమిలో 8 గుంటల ప్రభుత్వ స్థలాన్ని గ్రామపంచాయతీ కార్యాలయంలో తీర్మానం లేఖను ముస్లిం సోదరులకు అందజేయడం జరిగిందన్నారు. ఈ స్థలంలో పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన చాంద్ పాషా తల్లి మరణించిన ఆమెను అదే స్థలములో ఖననం బొంద పెట్టటం జరిగిందన్నారు. అప్పటినుండి పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన ముస్లిం సోదరులు ఎవరైనా మరణించిన వారిని అక్కడే ఖననం బొంద పెట్టటం జరుగుతుంది. పోతిరెడ్డిపేట్ గ్రామానికి చెందిన ముస్లిం సోదరులకు గ్రామపంచాయతీ గ్రామ ప్రజలు కేటాయించిన భూమిలో సిమెంట్ స్తంభాలను వారు పాతుకున్నారు కానీ అదే గ్రామానికి చెందిన గుల్ల శ్రీనివాస్ అనే వ్యక్తి ఆ సిమెంట్ స్తంభాలను తొలగించి బలవంతముగా ఆ స్థలములో టాక్టర్ పెట్టి బలవంతముగా ఆ స్థలములో చొచ్చుకొని వచ్చి దున్నుతున్నాడన్నారు. కావున అతనిపై తగిన చర్యలు తీసుకోవాలని కరీంనగర్ సిపి మహంతి, హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి, హుజురాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తిరుమల్ గౌడ్ లకు హుజురాబాద్ డివిజన్ మస్జిద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తో పాటు రజియా, చాంద్ పాషా, రియాజ్, మహమ్మద్ యాహూబ్, మున్ని, అంజత్, షేక్ అఫ్రీన్, ఆసియా, సన తదితరులు ఈరోజు హుజురాబాద్ రెవెన్యూ డివిజన్ అధికారి బి రమేష్ బాబు, హుజురాబాద్ తహసిల్దార్ కనకయ్యలకు విజ్ఞప్తి చేశారు. మాకు పోతిరెడ్డిపేట్ గ్రామములో ముస్లింల కబురస్థాన్ కొరకు 8 గుంటల ప్రభుత్వ స్థలం కేటాయించిన దానిలో దౌర్జన్యంగా వచ్చి టాక్టర్ పెట్టి దున్నుతున్న గుల్ల శ్రీనివాస్ పై తగిన చర్యలు తీసుకోవాలని ముస్లింలకు కేటాయించిన ఖబ్రస్తాన్ స్థలములో ఎవరు కూడా దానిలో చదవకుండా చర్యలు తీసుకోవాలని ఈరోజు హుజురాబాద్ ఆర్డిఓ బి సురేష్ బాబుకు, హుజురాబాద్ తాసిల్దార్ లకు హుజురాబాద్ డివిజన్ మస్జిద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తోపాటు పోతిరెడ్డిపేట్ గ్రామానికి చెందిన ముస్లిం సోదర సోదరీలు కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. పోతిరెడ్డిపేట్ గ్రామానికి చెందిన గ్రామపంచాయతీ కమిటీ సభ్యులందరూ తీర్మానం మరియు స్థానిక ప్రజలు కూడా అందరు సంతకాలు పెట్టి పోతిరెడ్డి పేట గ్రామానికి చెందిన ముస్లిం సోదరులకు ఇచ్చిన తీర్మానం ప్రకారం హుజురాబాద్ ఆర్ డి ఓ బి సురేష్ బాబు హుజురాబాద్ తహసిల్దార్ కనకయ్య చొరవ తీసుకొని పహానిలో మరియు ధరణిలో ఈ ఎనిమిది గంటల ప్రభుత్వ స్థలాన్ని ముస్లిం కబ్రిస్తాన్ నమోద చేయాలని ఈరోజు కలిసి వినతి పత్రం ద్వారా విజ్ఞప్తి చేయడం జరిగింది. పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన ముస్లిం సోదరులు మరణించిన వారిని ఖననం, బొంద పెట్టడానికి ఎనిమిది గుంటల ప్రభుత్వ స్థలాన్ని ఇప్పిచ్చిన ప్రజలందరికీ గ్రామపంచాయతీ సర్పంచ్ తో పాటు అందరికీ మా సంఘం హుజురాబాద్ డివిజన్ మస్జిద్ ఈద్గా కబ్రాస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ వారందరినీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలి గ్రామములో ముస్లింల కొరకు 8 గుంటల స్థలం కేటాయించిన గ్రామపంచాయతీ ప్రజల తీర్మానాన్ని అనుకూలముగా తీసుకొని వారిని పట్టా సర్టిఫికెట్ వెంటనే ఇవ్వాలని హుజురాబాద్ ఆర్డీవో బి సురేష్ బాబు హుజురాబాద్ తాసిల్దార్ కనకయ్య మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు.


