
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులుగా మండలంలోని పెద్దపాపయ్యపల్లి గ్రామానికి చెందిన మాదం ఐలయ్యను, మండల యూత్ ఉపాధ్యక్షులు చింతల నరేష్ ను నియమిస్తూ ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి మాటూరి శ్రీనివాస్ గౌడ్, నియోజకవర్గ అధ్యక్షుడు పెరమండ సదానందం గౌడ్ ప్రధాన కార్యదర్శి జూపాక ఐలయ్య గౌడ్ నియోజకవర్గం యూత్ అధ్యక్షుడు మ్యాడగోని శ్రీనివాస్ గౌడ్ లు నియామక పత్రం అందజేశారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ ఆదేశాల మేరకు ఈ నియామకం చేసినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ బీసీల సమస్యల పరిష్కారం కోసం తన వంతుగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆశయ సాధన కోసం పాటుపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యదర్శి మాటూరి శ్రీనివాస్ గౌడ్, నియోజకవర్గ అధ్యక్షుడు పెరమండ్ల సదానందంగౌడ్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి దాసరి ఐలయ్యగౌడ్, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు పల్లెర్ల కొమురయ్య, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు మ్యాడగోని శ్రీనివాస్ గౌడ్, మండల యూత్ అధ్యక్షుడు మామునూరి ప్రవీణ్, మండల యూత్ ప్రధాన కార్యదర్శి కొలిపాక క్రాంతికుమార్, మండల యూత్ ఉపాధ్యక్షులు చింతల నరేష్, ఎమ్మార్పీఎస్ నాయకుడు పి సహదేవ్, వెంకట్రావుపల్లె మాజీ సర్పంచ్ కే విజేందర్ పాల్గొన్నారు.








