
పసుల స్వామి.
M.A,BEd,
సామాజిక కార్యకర్త,
హుజురాబాద్.
9652872885.
S.R.S.P కెనాల్ కింద గల D.B.M-17 ఉపకాలువ పరిధిలో పెద్ద పాపయ్యపల్లి స్మశానం నుండి పెద్దపాపయ్యపల్లి, హుజురాబాద్, రాంపూర్, రంగాపూర్, రైతులకు సంబంధించిన అందాద 50 ఎకరాలకు ఈ కాల్వ నుండి నీటిపారకం కలదు. ఈ కాలువ పెద్ద పాపయ్యపల్లి నుండి ప్రారంభమై హుజురాబాద్ పోచమ్మ గుండ్ల కింది వరకు వెళ్లి వాగులో కలుస్తుంది. ఇట్టి ఉపకాల్వ కింద ఆయకట్టు రైతులు సంవత్సరానికి రెండు పంటలు పండించుకున్నారు. కానీ గత నాలుగు ఐదు సంవత్సరాల క్రితం నుండి ఇట్టి కాల్వలో నీరు వెళ్లకుండా అడ్డుగా తుంగ గడ్డి, పిచ్చి చెట్లు ముళ్లపొదలు, విపరీతంగా పూడిక పెరిగిపోయి కాలువ చివర ఉన్నటువంటి రైతులకు నీరు అందకుండా తగాదా లు, ఘర్షణలు పడుతున్నారు. కాల్వ చివరి రైతులు సక్రమంగా నీరు రాక తమ పొలాలను బీడుగా , పడావు పెట్టుకుంటున్నారు.
ఇట్టి సమస్యపై గతంలో సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన కూడా దాని పరిష్కారంపై దృష్టి పెట్టకుండా కాలయాపన చేసినారు.ప్రస్తుతం రబీ సీజన్లో రైతులందరూ నేడో, రేపో కాలువ నీళ్లు వదులుతారని ,వరి పంట సాగు చేసుకుందామని ఆయకట్టు రైతులు నార్లు పోసుకోవడానికి ఆశగాఎదురుచూస్తున్నారు. కానీ తూము నుంచి వదిలిన నీరు కాల్వ చివరి రైతులకు సరిగ్గా అందకుండా పూ డిక మరియు ముళ్ళ, చెట్లు పొదలు దట్టంగా పెరిగి, కాల్వ చివరి రైతులకు నీరందకుండా నానా అవస్థలు పడుతున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం సంబంధించిన అధికారులు,గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్ , ఎంపీడీవో అధికారి గారు మరియు ఎస్సారెస్పీ సంబంధిత అధికారులు ఇట్టి సమస్య విషయమై చొరవ తీసుకొని కాలువ లోపల ఉన్నటువంటి పూడిక మరియు ముండ్ల చెట్లను తొలగిస్తే రైతులకు ఎంతో మేలు చేసిన వారు అవుతారు.
———————————-
స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:
———————-+——————-












