
కుమార్ యాదవ్, స్వర్ణోదయం రిపోర్టర్ జమ్మికుంట: జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మారుతి నగర్ లో మంగళవారం క్రిస్మస్ పండుగ సందర్భంగా నిరుపేదలకు అంబాల లత ప్రభు లు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభు మాట్లాడుతూ హిందువులకు దసరా పండుగ సందర్భంగా, ముస్లింలకు రంజాన్, బక్రీద్ సందర్భంగా నిరుపేదలకు దుస్తులు పంపిణీ చేసిన విధంగా , క్రిస్మస్ పండుగ సందర్భంగా కూడా తమకు , దాత నందిని డ్రెసెస్ వారి సహకారంతో తోచిన సహాయంగా నిరుపేదలకు సుమారు 30 మందికి షుమారు 15 వేల విలువ చేసే దుస్తులను పంపిని చేయడం ఆనందకరమని అన్నారు. ప్రతి ఒక్కరు కూడా తమ ప్రాంతంలో ఉన్న నిరుపేదల పట్ల జాలి, కరుణ మానవత్వంతో అంటూ సేవా భావంతో తోచిన సహాయాన్ని అందిస్తూ ఆదుకోవాలని కోరారు. అదే విధంగా క్రిస్టియన్ సోదర, సోదరి మణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ వారందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలు నిండు నూరేళ్ళు జీవించాలనే కోరారు.






