
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, డిసెంబర్ 25: హుజురాబాద్ పట్టణంలో బుధవారం క్రిస్మస్ వేడుకలను క్రిస్టియన్ లు ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని ఆగాపే అగ్నిజ్వాల మినిస్ట్రీస్ఫౌండర్ చైర్మన్ పాస్టర్ నాగేశెట్టి డానియల్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. సంఘస్తులతో కలిసి కేక్ కట్ చేసుకొని ఆనందోత్సాహాల్లో మునిగారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ గన్దే రాధిక, పాస్టర్ డానియల్ మాట్లాడుతూ.. దుఃఖం తొలగించేదే నిజమైన క్రిస్మస్ అని అన్నారు. క్రీస్తు యేసు పాపులను రక్షించడానికి భూలోకానికి వచ్చాడని, తండ్రి కుమారుని పంపించాడని తండ్రి అప్ప చెప్పిన పని కుమారుడు తూచా తప్పకుండా బాధ్యత నిర్వహించినట్లు వారు తెలిపారు. ఈ క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకుంటున్న ప్రతి ఒక్కరికి భారతదేశ జనులందరికీ దుఃఖమును తొలగించి సంతోషమును కలిగించినట్లు ఆయన తన హస్తాలతో ఆశిర్వదించ బోతున్నట్లు వారు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 200 మంది సంఘస్తులు పాల్గొన్నారు.
,




