Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఆఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 43వ రాష్ట్ర మహాసభలు 23, 24, 25 తేదీలలో సిద్దిపేటలో నిర్వహించారు. ఈ రాష్ట్ర మహాసభలలో అనేక రకాల విద్యారంగ మరియు సామాజిక సమస్యలపైన అనేక తీర్మాణాలు చేశారు. అనంతరం 2024-25 కి సంబంధించిన ఏబీవీపీ నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని రాష్ట్ర అధ్యక్షుడు జానారెడ్డి ప్రకటించారు. ఈ నూతన కార్యవర్గంలో హుజురాబాద్ కు చెందిన గోస్కుల అజయ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. గతంలో కళాశాల అధ్యక్షునిగా, కళాశాల కార్యదర్శిగా, నగర సంయుక్త కార్యదర్శిగా, నగర ఉపాధ్యక్షుడిగా, కార్యవర్గ సభ్యుడు గా, పలు బాధ్యతలు నిర్వహించారు. ఈ సందర్భంగా గోస్కుల అజయ్ మాట్లాడుతూ నన్ను నమ్మి రాష్ట్ర శాఖలో స్థానం కల్పించి రెండవ సారి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఎన్నుకున్న రాష్ట్ర శాఖకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే అనునిత్యం విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు.







