Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి,హుజురాబాద్:
ఈనెల 27 నుండి హైదరాబాదులోనీ గచ్చిబౌలి స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి సీఎం కప్పు హాకీ పోటీలకు హుజురాబాద్ పట్టణం నుండి 8 మంది హాకీ క్రీడాకారులు ఎంపికయ్యారు. రాష్ట్రస్థాయి హాకీ పోటీలలో కరీంనగర్ జిల్లా జట్టు తరఫున వీరు పాల్గొననున్నారు. ఎంపికైన క్రీడాకారుల్లో పల్లపు సాంబరాజు, మోటపోతుల వినయ్, మోటపోతుల వినీత్, మోటపోతుల విపుల్, మ్యాదరబోయిన పవన్, ఐత ఆదిత్య, సాయిమని, పోలు రాజ్ కుమార్, సారబుడ్ల సాయి మిథున్ రెడ్డిలు ఉన్నారు. 8 మంది హాకీ క్రీడాకారులు రాష్ట్ర స్థాయికి ఎంపిక పోవడం పట్ల హాకీ క్లబ్ శాశ్వత సభ్యులు తోట రాజేంద్రప్రసాద్, జిల్లా నాయకులు బండ శ్రీనివాస్, క్లబ్ అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్, క్రీడాకారులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, చింత శ్రీనివాస్ గౌడ్, భూసారపు శంకర్, జీ ఉమామహేశ్వర్, టీ శ్రీనివాస్ లు హర్షం వ్యక్తం చేశారు.






