
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: జ్యోతిబా పూలే కమిటీ మాజీ చైర్మన్ సందేల వెంకన్న ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద గురువారం రాత్రి సర్దార్ ఉద్ధం సింగ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ ఆజాద్ ఫెడరేషన్ గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, బీసీ ఆజాద్ యూత్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు జక్కని సంజయ్, కట్కూరి రాజేందర్ బహుజన ఉద్యమకారులు, రాo సారయ్య మాస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మహాసభ కన్వీనర్ రామ్ రాజేశ్వర్ లు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని తన ప్రాణాన్ని తృణప్రాయంగా భావించి దేశ స్వాతంత్రం కొరకు తన ప్రాణాన్ని బలి ఇచ్చినటువంటి సర్దార్ ఉద్ధం సింగ్ సేవలు మరువలేనివని అన్నారు. తాను పంజాబ్ రాష్ట్రంలో ఒక పేద కుటుంబంలో జన్మించగా చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాధాశ్రమంలో తన జీవితాన్ని గడుపుతున్నటువంటి సందర్భంలో 1919వ సంవత్సరంలో అమృత్ సర్ జలియన్‌వాలాబాగ్ లో తమ ఆచార సాంప్రదాయాలకు నిలయమైన బైసాకి పండుగను జరుపుకుంటూ రౌలర్ చట్టం కింద బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసిన భారత భారతీయుల అరెస్టులకు నిరసన నిరాయుధీకరణతో శాంతియుతంగా నిరసన చేస్తుండగా అనాలోచితంగా మైకేల్ వుడ్ వైర్ ఆధ్వర్యంలో కాల్పులు జరిపిందని గుర్తు చేశారు. ఈ కాల్పుల్లో వందలాదిమంది అశువులు బాయగా దీనిని జీర్ణించుకోలేని ఉద్దాం సింగ్ 1940 సంవత్సరంలో తాను చేసిన ప్రతిజ్ఞతో లండన్ లో మాజీ జనరల్ మైకేల్ వుడ్ వైర్ ను హతమార్చగా అక్కడున్నటువంటి సైనికులు ఉద్ధం సింగ్ ను కాల్చగా భారత్ మాతాకీ జై అని నినదిస్తూ ప్రాణాలు వదిలిన ఆ దేశభక్తుని సేవలు అజరామరమని కొనియాడారు. అతను ఎప్పుడు కూడా భారతీయుల గుండెల్లో కొలువై ఉంటాడని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్ చక్రధర్ సీనియర్ బీసీ నాయకులు, భారత ప్రభాకర్ పురగిరి క్షత్రియ పెరిక సంఘం నాయకులు, తిప్పారపు భువన చందర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, భీంపెళ్లి సమ్మయ్య వికలాంగుల హక్కుల సాధికారత సంఘం, కలకోటి శ్రీనివాస్, ముక్క మొగిలయ్య, రామస్వామి, ఎర్ర రాజు స్వేరో, దాట్ల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.








