Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణానికి చెందిన గౌరిశెట్టి భవాని (48) గుండెపోటుతో గురువారం మధ్యాహ్నం మృతి చెందారు. దీంతో ఆమె కళ్ళను ఎల్వి ప్రసాద్ కంటి వైద్యశాలకు అప్పగించారు. దీంతో ఆమె చూపు సజీవంగా నిలవడమే గాక.. ఆమె నేత్రదానంతో ఇద్దరి అంధుల జీవితాల్లో వెలుగు నింపిన కుటుంబ సభ్యులను సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు అభినందించారు. LVP వరంగల్ టెక్నీషియన్ రాజేంద్రప్రసాద్ నేత్రాలను సేకరించారు. హుజురాబాద్ పట్టణం గాంధీనగర్ నివాసి అయిన గౌరీశెట్టి భవాని గుండె పోటుతో 26న మధ్యాహ్నం 2-30 గంటలకు మృతిచెందగా జమ్మికుంట వ్యాపారి కాసం నగేష్ సమాచారం మేరకు గర్రెపల్లి వెంకటేశ్వర్లు డీలర్, రావికంటి రాజేందర్, యోగ గురువు నరహరి, నేత్రదానంపై వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించగా కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో యోగా గురువు మరియు సదాశయ ఫౌండేషన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మచ్చగిరి నరహరి ఆధ్వర్యంలో, వరంగల్ LVP technician రాజేంద్ర ప్రసాద్ సహకారంతో నేత్ర సేకరణ చేసి హైదరాబాద్ LVP ఐ బ్యాంక్ పంపడం జరిగింది. ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించిన భర్త గౌరీశెట్టి శ్రీనివాస్, కూతురు సంయుక్త మరియు సహకరించిన వంగల రమేష్ జిరాక్స్, గర్రెపల్లి వెంకటేశ్వర్లు డీలర్, కాసం నగేష్, రావి కంటి రాజేందర్ లకు మరియు బంధుమిత్రులకు సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రవణ్ కుమార్, జాతీయ ప్రధాన కార్యదర్శి లింగమూర్తి ,జాతీయ కార్యదర్శి డాక్టర్ భీష్మాచారి, ముఖ్య సలహాదారులు నూక రమేష్, గౌరవ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, ప్రచార కార్యదర్శి వాసు, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు నరహరి లగిశెట్టి చంద్రమౌళి, మరియు బంధు మిత్రులు అభినందనలు ధన్యవాదాలు తెలిపారు.







