
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:ఆగి ఉన్న బస్సును ఓ లారీ ఢీ కొట్టిన ఘటనలో టూర్ కి వెళ్తున్న విద్యార్థులకు తృటిలో భారీ ప్రాణ తప్పగా.. ఒకరికి గాయాలు అయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలానికి చెందిన ఓ ప్రైవేట్ స్కూలు విద్యార్థులు సుమారు 50 మంది ప్రైవేటు టూరిస్ట్(ట్రావెల్) బస్సును మాట్లాడుకుని భద్రాచలం వెళ్తుండగా హుజురాబాద్ మండల సమీపంలోనీ కేసి క్యాంపు వద్ద ఆర్ధరాత్రి ఆగి మూత్రం పోస్తున్న క్రమంలో వెనకాలే వచ్చిన లారీ అదుపుతప్పి వెనక నుంచి ఢీ కొట్టింది. ఆ సమయంలో విద్యార్థులు ఒక్కొక్కరుగా బస్సులోకి ఎక్కుతుండగా, ఒక విద్యార్థికి తీవ్ర గాయాలు అయ్యాయి. మిగతా విద్యార్థులు భయంతో పరిగెత్తారు. వెంటనే గాయపడ్డ విద్యార్థిని ప్రైవేట్ అంబులెన్స్ లో హుజురాబాద్ ఏరియా హాస్పిటల్ కి తరలించారు.





