Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: భారత మాజీ ప్రధానమంత్రి ఆర్థిక సంస్కరణల పితామహుడు దివంగత నేత డా. మన్మోహన్ సింగ్ అకాల మరణానికి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ హుజురాబాద్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పంజాల అరవింద్ గౌడ్ ఆధ్వర్యంలో హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించి ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అరవింద్ గౌడ్ మాట్లాడుతూ డాక్టర్ మన్మోహన్ సింగ్ భారత ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదులు వేసి, దేశాన్ని ప్రగతిపథంలో నడిపించిన మహా నేత అన్నారు. ఆయన సారథ్యంలో భారతదేశం ఆర్థిక స్వావలంబనతో పాటు ప్రపంచ వాణిజ్యంలో కీలకమైన స్థానం పొందిందన్నారు. “నాయకత్వం అనేది పదవిని కాదు, బాధ్యతను సూచిస్తుందనీ, ప్రజల కోసం పనిచేయడం నా ధర్మం నా కర్తవ్యము అని కొనియాడిన గొప్ప నేత మన్మోహన్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన ప్రధాన కార్యదర్శులు పర్లపెల్లి నాగరాజు, సజ్జు, ఎన్ ఎస్ యూఐ జిల్లా ఉపాధ్యక్షులు ఇమ్రాన్, హుజురాబాద్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శులు శనిగరం తరుణ్ కుమార్, మార్క సురేందర్, నరేష్, సందీప్, నవీన్, మండల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మేకల రాజుకుమార్, సందీప్, చల్లురి విష్ణువర్ధన్, ప్రధాన కార్యదర్శి పంజాల రాజుగౌడ్ మరియు యువజన కాంగ్రెస్ నాయకులు శివమణి, మధుకర్, రావుల సురేందర్, గణేష్, సంపత్, వంశీ, కృష్ణంరాజు, అక్లేష్, రాజు, సందీప్, బన్నీ, మనోజ్, రామిజ్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.






