
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ లోని సూపర్ బజార్ లో గల శ్రీరామ పాలి క్లినిక్ లో ఆదివారం ముందస్తు నూతన సంవత్సర 2025 వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ బెస్ట్ న్యూరో సర్జన్ అవార్డు గ్రహీత “డాక్టర్ ఎస్ మధు బాబు ఎమ్మెస్ ఎంసి హెచ్” ఆధ్వర్యంలో ముందస్తు సెలబ్రేషన్ నిర్వహించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో అందరూ సుఖసంతోషాలతో, ఆనందాలతో వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ హాస్పిటల్ యాజమాన్యం నంబి భరణి కుమార్, మూషికే శ్రీనివాస్, హుజురాబాద్ మండల్ ఆర్ఎంపి &పి.ఎం.పి అధ్యక్షులు పంజాల తిరుపతిగౌడ్, హాస్పిటల్ స్టాప్ దీపిక, సునీత, సాయి తదితరులు పాల్గొన్నారు.






