
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పుడమి సాహితీ వేదిక ఆరవ వార్షికోత్సవ సందర్భంగా పుడమి జాతీయ వేదిక ఖమ్మం మరియు మానవ హక్కుల పరిరక్షణ సమితి ఖమ్మం సంయుక్తంగా నిర్వహించిన పుడమి జాతీయ రత్న విశిష్ట సేవ పురస్కారాల్లో భాగంగా సేవా రంగంలో సామాజిక సేవా కార్యక్రమాలు మరియు ఆపదలో విశిష్ట సంఖ్యలో రక్తదానాలు చేసి ఎంతో మందికి రక్తదానం చేసిన హుజురాబాద్ మండలం చెల్పూర్ గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు ఆరె రాకేష్ రెడ్డికి తెలంగాణ సేవారత్న 2024 అవార్డును బహూకరించినట్లు పుడమి సాహితీవేదిక జాతీయ అధ్యక్షుడు చిలుమల్ల బాల్రెడ్డి తెలిపారు. ఈ పురస్కారంను తనను ఎంపిక చేయడంపై రాకేష్ రెడ్డి ఆనందం వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగించ నున్నట్లు తెలిపారు. తనను ఈ అవార్డు ఎంపిక చేసిన పుడమి జాతీయ వేదిక నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.



