
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
పీష్వాల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మహర్లు వీరోచితంగా పోరాడి యుద్ధ విజయానికి చిహ్నమే బీమా కోరేగావ్ అని, జనవరి 1 1818 సంవత్సరంలో 500 మంది మహార్లు 28 వెయ్యిల పీష్వాబ్రాహ్మణ సైన్యంతో మహారాష్ట్రలోని కోరేగావులోని భీమా నది ఒడ్డున భీకర యుద్ధం చేసి విజయం సాధించారన్నారు. అపార సైనిక బలగం కలిగిన ఈశ్వర్ రాజ్యంతో యుద్ధం చేయలేని బ్రిటిష్ వాళ్ళు తమతో కలిసి పోరాడాలని మహరులను కోరారన్నారు. అప్పటి మహార్ల నాయకుడు సీదునకు పీష్వా సైన్యాధికారి బాపు గోఖలే వద్దకు వెళ్లి పశువులకన్న ఈనంగా చూస్తున్న తమకు గౌరవంగా బతికే అవకాశం కల్పించాలని కోరారు. వేల సంవత్సరాల బానిస సంఖ్యలు తెంచుకోవాలని ప్రతినబునిన 500 మంది మాహరుసైన్యం బ్రిటిష్ సైన్యంతో కలిసి 200 కిలోమీటర్ల నడిచి భీమా నది ఒడ్డుకు చేరుకున్నారన్నారు. మహారు సైన్యం పీష్వా సైన్యంతో యుద్దానికి తలపడిందని, భీకర పోరాటంలో భీమా నది ఎర్రబడిందన్నారు. పీష్వాసైన్యం వెనక్కి తగ్గిందని మహార్లు విజయం సాధించారన్నారు. ఈ యుద్ధములో 12 మంది అమరులైనారన్నారు. ఈ యుద్ధములో అమరులైన మహార్లకు బ్రిటిష్ ప్రభుత్వం స్మారక స్థూపం కటించిందని తెలిపారు. నివాళులర్పించే కార్యక్రమంలో సొల్లు బాబు, పాక సతీష్, పసుల స్వామి, సందేల వెంకన్న, చౌడమల్ల నరేష్, కోడం నరిసింగం, ఆకునూరి అచ్యుత్, సాగర్, కోటీశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.
