
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : స్థానిక సంస్థలలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు సాధనకై బీసీ మహాసభ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో జనవరి మూడో తేదీన జరగనున్న ఈ సభకు పార్టీలకతీతంగా బీసీలు కదలి రావాలని కరీంనగర్ ఉమ్మడి జిల్లా బీసీ సంఘం బాధ్యులు నిమ్మటూరి సాయికృష్ణ పిలుపునిచ్చారు. హుజురాబాద్ పట్టణంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ మహాసభ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సాయికృష్ణ మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ వెళ్ళినట్లయితే బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలుగా మేము ఊరుకునేది లేదు హెచ్చరించారు. బీసీలుగా మేము సమగ్ర కులగణన సర్వే ప్రకారం మేము 60% ఉన్నందున స్థానిక సంస్థల్లో బీసీలమైన మేము అన్యాయానికి గురవుతున్నందున కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని అమలుపరచాలని బీసీ మహాసభ నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలుపరచలేని పక్షంలో బీసీ మహాసభ ద్వారా జాగృతమై కాంగ్రెస్ పార్టీ పై బీసీలందరం ఏకమై బీసీల యుద్ధం ప్రకటిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాధ్యులు తులసి లక్ష్మణమూర్తి, చిలుకమారి శ్రీనివాస్, గడ్డం రమేష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

