
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని హైస్కూల్ గ్రౌండ్ లో మంగళవారం సాయంత్రం నూతనంగా ఏర్పాటు చేసిన హైమాక్స్ లైట్లను హుజురాబాద్ మున్సిపల్ ఛైర్ పర్సన్ గందె రాధిక శ్రీనివాస్ ప్రారంభించారు. గత కొన్నాళ్లుగా అరకోర లైట్లతో క్రీడా మైదానంలో వాకర్సు, క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారని వచ్చిన విజ్ఞప్తిల మేరకు ఈ లైట్లను ఏర్పాటు చేయడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు తాళ్ళపల్లి శ్రీనివాస్ గౌడ్, బర్మావత్ యాదగిరి నాయక్, అపరాజ ముత్యంరాజు, తొగరు సదానందం, పాల కిషన్, ముక్క రమేష్, డిష్ కుమార్ యాదవ్, కల్లేపల్లి రమాదేవి, కేశిరెడ్డి లావణ్య, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, కమిషనర్ సమ్మయ్య, వాకర్స్ అధ్యక్షుడు గోవర్ధన్, కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ ఏఈ సాంబరాజు, వాకర్స్, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.




