
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గంలో కొత్తగా నాలుగు మండలాలు ఏర్పాటు చేయాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలోని ఉప్పల్, శనిగరం, వావిలాల, చల్లూరులను వెంటనే నాలుగు మండలాలుగా ప్రకటించాలని ఆయన హైదరాబాదులోని తన స్వగృహంలో మాట్లాడారు. ఈ నాలుగు గ్రామాలకు మండలాలుగా ప్రకటించేందుకు కావలసిన అన్ని అర్హతలు ఉన్నాయని, దీంతో నియోజకవర్గం లోని ప్రజలకు అన్ని విధాలుగా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. మండలాల ఏర్పాటుతో నియోజకవర్గ అభివృద్ధి కూడా జరుగుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే ఈ నాలుగు గ్రామాలను మండలాలుగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
