
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపల్ పరిధిలో మంగళవారం జరిగిన వార్డు సభల్లో అధికారులను ప్రజలు నిలదీశారు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో రేషన్ కార్డుల లిస్టుల విషయంలో అధికారుల తీరును ప్రజలు తప్పుపట్టడంతో పట్టణంలోని పలు వార్డుల్లో రేషన్ కార్డుల విషయంలో ప్రజలు తీవ్ర అభ్యంతరాలు తెలిపారు. పట్టణంలోని పలు వార్డుల్లో సరిపడా స్టేషనరీ సామాను లేదని, అప్లికేషన్లు పెట్టుకునేందుకు కనీసం తెల్లపేపర్లు సైతం లేవని వాపోతున్నారు. తూతూ మంత్రంగా కొద్ది సంఖ్యలోనే అప్లికేషన్లు పెట్టుకునేందుకు తెల్ల పేపర్లు అందుబాటులో ఉంచారన్నారు. పట్టణంలోని ఇందిరానగర్ లో ఇందిరమ్మ ఇండ్లు అనర్హులకే ఇచ్చారని వార్డు ప్రజలతో పాటు కాంగ్రెస్ నాయకులు అధికారులతో గొడవకు దిగారు. ఈ లిస్టునే ప్రామాణికంగా చేసుకుంటే నిజమైన అర్హులు నష్టపోతారన్నారు. మున్సిపల్ కమిషనర్ ఈ లిస్టు ఫైనల్ కాదని హామీ ఇచ్చేవరకు కొత్త అప్లికేషన్లు పెట్టుకోబోమని వార్డు ప్రజలు సభను అడ్డుకున్నారు. ఇక చేసేదేంలేక మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యను, మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధికను వార్డు సభకు అక్కడి అధికారులు పిలిపించారు. ఈలిస్టులో పేర్లు రాని వారు కొత్త అప్లికేషన్లు పెట్టుకోవచ్చని మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య చెప్పి సముదాయించారు. అయినా..ఇందిరమ్మ ఇండ్లకు ఎంపికైన వారి లిస్టును రద్దు చేసే వరకు కొత్త అప్లికేషన్లు పెట్టుకోబోమని తేల్చిచెప్పడంతో అధికారులు చేసేదేంలేక అక్కడినుంచి వెళ్లిపోయారు. వాస్తవానికి వార్డు శాఖ అధికారులు తమ ఇష్టారాజ్యంగా అర్హులను ఎంపిక చేశారని, అసలైన లబ్ధిదారుల ఎంపికను మరిచారని అంతేగాక ప్రజా ప్రతినిధుల పదవీకాలం ముగుస్తుండడంతో వారికి దగ్గరైన వారి పేర్లు మాత్రమే ఎంపీక చేసి లబ్ధిదారులుగా చూపించారని పలువురు ఆరోపించారు.









ఇందిరమ్మ ఇళ్ల బాధితులు..