
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్, జనవరి 21: నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని హుజూరాబాద్ సింగిల్ విండో చైర్మన్ ఎడవెల్లి కొండల్ రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…మండలంలో ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరపాలని కోరారు. ఎలాంటి పైరవీలకి తావు లేకుండా చూడాలన్నారు. కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకే ప్రభుత్వ పథకాలు అన్నట్టుగా కొనసాగుతుందన్నారు. నిజమైన లబ్దిదారులకే సంక్షేమ పథకాలు అందజేయాలని, ప్రస్తుతం మండలంలో ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు 10 శాతం మందికి మాత్రమే ఇస్తున్నారని అన్నారు. మిగిలిన 90శాతం మంది అర్హులైన నిరుపేదలకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికార పార్టీ ప్రభుత్వం ప్రజలను నిర్లక్ష్యం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ కమిటీ మండలాధ్యక్షుడు దాసరి రమణారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు డాక్టర్ సంగెం ఐలయ్య, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఇరుమల్ల సురేందర్ రెడ్డి, కన్నెబోయిన తిరుపతి యాదవ్, కాసగోని కిరణ్ గౌడ్, కానుగంటి శ్రీనివాస్, మండ సతీష్ గౌడ్, తాళ్లపల్లి వెంకటేష్ గౌడ్, తదితరులున్నారు.

