
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: భారతీయ జనతా పార్టీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ఆలోచన విధానాలు, ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందని హుజురాబాద్ పట్టణంలో అభియాన్ కార్యక్రమ సన్నాక సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు పేర్కొన్నారు. ప్రజల్లో తగిన అవగాహన కల్పించి సంవిధాన్ గౌరవ్ అభియాన్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని బిజెపి పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ రావుల వేణు, ఈ కార్యక్రమ కో ఆర్డినేటర్లు కొలిపాక శ్రీనివాస్, బోరగల సారయ్య, కొమరవెల్లి సంతోష్, హుజురాబాద్ పట్టణ 22వ వార్డు కౌన్సిలర్ పైళ్ళ వెంకటరెడ్డి, సీనియర్ నాయకులు గంగిశెట్టి రాజు, నరాల రాజశేఖర్, తిప్పబత్తిని రాజు, యంసాని శశిధర్, తూముల శ్రీనివాస్, యాళ్ల సంజీవరెడ్డి, అంకతి వాసు, గంట సంపత్, మోతే తిరుపతి, కొలిపాక వెంకటేష్, తాళ్లపల్లి హరీష్ తదితరులు పాల్గొన్నారు.

