
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
సైదాపూర్ మండలం రాములపల్లి, గుజ్జలపల్లి గ్రామాలలో మంగళవారం జరిగిన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త ఆహార భద్రత కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల స్థానిక గ్రామ పంచాయతీలలో గ్రామసభలు ప్రశాంతంగా జరిగాయి. ఈనెల 26న అమలు చేయనున్న నాలుగు సంక్షేమ పథకాలకు సంబంధించి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త ఆహార భద్రత కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు గ్రామ సభలు స్థానిక రాములపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో పంచాయతీ సెక్రెటరీ మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో మండల ప్రత్యేక అధికారి, ఎంపీడీవో భాగ్య, మరో ప్రత్యేక అధికారి యాదగిరి, రాములపల్లి
ఏఈఓ రజినీకాంత్, నాగార్జున, గుజ్జులపల్లి ప్రత్యెక అధికారి పి మహేందర్, తదితరులు పాల్గొన్నారు.

