
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు హుజురాబాద్ పట్టణంలో గల ప్రైవేట్ పాఠశాలల స్కూల్ బస్సులను మంగళవారం ఎంవిఐ కంచే వేణు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…డ్రైవర్ ఒక వ్యక్తిగత అనుభవం కాకుండా సామాజిక బాధ్యతగా వాహనం నడిపే వారందరూగా గుర్తించబడాలి అన్నారు. రహదారి భద్రత నియమాలను సక్రమంగా పాటించడమే కాకుండా రహదారి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. వాహనాదారులు యాజమాన్యంతో డ్రైవర్లు రహదారి భద్రత నియమాలను పాటించి ప్రమాదాలను నివారించాలని తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మోటార్ వాహనాలు నడపడం మరియు సెల్ ఫోన్ మాట్లాడుతూ నడపకూడదని సూచించారు. వాహనము మలుపు తిరుగుతున్నప్పుడు నిలుపు ఉన్నప్పుడు చేతితో సరైన సంకేతాలు ఇవ్వాలన్నారు. ముందు వెళ్లే వాహన డ్రైవరు దారి ఇవ్వనిచో వాహనము దాటుటకు ప్రయత్నించకండి అని హెచ్చరించారు. కదులుతున్న వాహనం ఎక్కడం కానీ దిగడం కానీ చేయకూడదన్నారు. ఇరుకు వంతెన వద్ద ట్రాఫిక్ ను గమనించి సహనముతో దాటాలన్నారు. తడిగా ఉన్న ఆయిల్ ఉన్న ఇసుక ,దుమ్ము, బురద ఉన్నప్పుడు రోడ్డుపై వేగంగా వెళ్ళుట ప్రమాదకరం అన్నారు. రోడ్డు నిబంధనలు సూచనలకు డ్రైవర్లకే కాదు పాదాచారుల కూడా వర్తిస్తయన్నారు. పాదాచార్యులు రోడ్డుకు ఇరువైపులా చూసి వాహనము రానప్పుడు జీబ్రా లైన్లో వద్దనే రోడ్డును దాటాలన్నారు. నిర్ధారిత స్థలంలో మాత్రమే వాహనాన్ని పార్కింగ్ చెయ్యాలని, పరిమితిని మించి విద్యార్థులను బస్సుల్లో అనుమతించరాదని తెలిపారు. బస్సు సరైన కండిషన్లో ఉన్నప్పుడు మాత్రమే దాన్ని విద్యార్థులకు ప్రయాణానికి ఉపయోగించాలని మంచి నైపుణ్యం గల డ్రైవర్ను మాత్రమే స్కూల్ బస్సు నడపడానికి విధుల్లోకి తీసుకోవాలని యాజమాన్యాలకు సూచించారు. స్కూల్ బస్సు లేత పసుపు రంగు వేయడం వల్ల దీనికి తేలికగా గుర్తించడానికి వీలవుతుందని. స్కూల్ బస్సులో ఎప్పుడు ఒకరు లేదా అంతకన్నా ఎక్కువ ఉపాధ్యాయులు ప్రయాణించేలా చూడాలని యాజమాన్యం మరియు పేరెంట్ కమిటీ సమన్వయంతో బస్సులు బయలుదేరి సమయం నుండి గమ్యస్థానం వరకు ప్రతిరోజు వంతు వారిగా ఒక టీచరు ఒక పేరెంట్ బస్సులో ప్రయాణించేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా మండల అధ్యక్షుడు వకులభరణం వెంకటేశ్వర్లు, వివిధ పాఠశాల కరస్పాండెంట్లు బద్ధుల రాజ్ కుమార్, కోటేశ్వర్, రవీందర్ రెడ్డి, పిల్లల సతీష్, రవాణా శాఖ సిబ్బంది, ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ నాగరాజు, హోంగార్డ్ గుర్రం శ్రీకాంత్ గౌడ్, బస్సు డ్రైవర్లు, క్లీనర్లు పాల్గొన్నారు.







