
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: చెట్టును లారీ ఢీకొని ఒకరు మృతి చెందగా మరోకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటన కరీంనగర్ – వరంగల్ జాతీయ రహదారిపై హుజురాబాద్ మండలం మాందాడిపల్లి వద్ద చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హుజురాబాద్ మండలం మాందాడిపల్లి వద్ద బుధవారం తెల్లవారుజామున హుజురాబాద్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్లో డ్రైవర్, క్లీనర్ ఇరుక్కుపోయారు. వాళ్లను బయటకు తీసేందుకు హుజురాబాద్ సీఐ తిరుమల్ గౌడ్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఫైర్ రెస్క్యూ సిబ్బందిని పిలిచి క్రేన్ సహాయంతో లారీని పక్కకు తరలించారు. క్లీనర్ తీవ్ర గాయాలతో ఉన్నాడు. వీరిని హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ లారీ క్లీనర్ మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రి మార్చురికి తరలించారు. ఈ ఘటన జాతీయ రహదారిపై జరగటం, క్యాబిన్లో ఇద్దరు ఇరుక్కోవడంతో వారిని తీసేందుకు దాదాపు గంటకు పైగా ఫైర్ పోలీసు సిబ్బంది కృషి చేయడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కాగా క్లీనర్ మృతిచెందగా డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి.
