
–ఖబర్దార్ బిజెపి పార్టీ నాయకుల్లారా
–మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు..
–యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్లపల్లి నాగరాజు
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: వయానాడ్ ఎంపీ ప్రియాంక గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిజెపి పార్టీ మాజీ ఎంపీ రమేష్ బీదూరి మరియు మోడీ దిష్టిబొమ్మలను హుజురాబాద్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పంజాల అరవింద్ ఆధ్వర్యంలో దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధానకార్యదర్శి పర్లపల్లి నాగరాజు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం వచ్చాక మహిళల పట్ల, దళితుల పట్ల అనేక దాడులు జరిగాయని చట్ట సభలకు వెళ్లే నాయకులు ఒక మహిళా ఎంపీ అని చూడకుండా ఈవిధంగా మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు? మహిళల పట్ల కించపరిచే విధంగా మాటలు మాట్లాడడం దురదృష్టకరమని, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒకపక్క మహిళలను మేము చాలా గౌరవిస్తామని చెప్పుకుంటూ మరోపక్క వారి పార్టీ నాయకులు మహిళలను అగౌరవపరిచే మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు?ప్రియాంక గాంధీకి వెంటనే బిజెపి పార్టీ మరియు మాజీ ఎంపీ రమేష్ బీదూరి క్షమాపణ చెప్పాలని, బిజెపి పార్టీ రమేష్ బీదూరిని పార్టీ నుండి వెంటనే సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లేనిపక్షంలో యువజన కాంగ్రెస్ పక్షాన తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బిజెపి పార్టీని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్లపల్లి నాగరాజు, NSUI జిల్లా ప్రధాన కార్యదర్శి గండు ప్రశాంత్, మండల ఉపాధ్యక్షులు చల్లూరి విష్ణువర్ధన్, రేణుకుంట్ల సందీప్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శులు బండ నవీన్, ,శనిగరం తరుణ్ కుమార్, మార్క సురేందర్, చిట్యాల రేవంత్ యువజన కాంగ్రెస్ నాయకులు అజయ్, నవీన్, నరేష్, కొండ్ర నాగరాజు, మోరే అజయ్, నాగరాజు, వంశీ, అజిత్, సంపత్ ,వినయ్ రాజేష్, చక్రి, అన్వేష్, మధు, అజయ్, Md రామీజ్ తదితరులు పాల్గొన్నారు.



