
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ లో బీసీ ఆజాద్ యూత్ ఫెడరేషన్ డివిజనల్ అధ్యక్షుడు పంజాల తిరుపతి గౌడ్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని హుజురాబాద్ పట్టణంలోని వరంగల్ రోడ్డులో ఉన్న స్వామివివేకానంద విగ్రహానికి పూలను మాలలు వేసి నివాళులర్పించారు. స్వామి వివేకానంద యువతకు ఇచ్చిన సందేశాల గురించి వివరించారు. స్వామి వివేకానంద అడుగుజాడల్లో యువత నడుచుకొని దేశ భవిష్యత్తుకు ఉపయోగపడాలని తిరుపతి గౌడ్ సూచించారు. ఈ కార్యక్రమంలో పంజాల తిరుపతి గౌడ్ బీసీ ఆజాద్ యూత్ ఫెడరేషన్ డివిజన్ అధ్యక్షుడుతో పాటు ఆర్ఎంపీ మండల అధ్యక్షుడు తోటి ఆర్.ఎం.పి మిత్రులు శ్రీనివాస్ రెడ్డి, మాధవరెడ్డి, శ్రీనివాస్, మహమ్మద్ గని, తిరుపతి, నాగరాజు, బాలయ్య, తిరుపతి, చందర్ రావు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.







