
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో కలిసి కరీంనగర్ లో జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డితో జరిగే సమావేశానికి వెళ్తారని ముందుగానే పసిగట్టిన పోలీసులు బిఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్టు చేశారు. స్థానిక బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు మొలుగు పూర్ణచందర్, అజ్మతుల్లా ఖాన్, హర్షద్, అఖిల్, ఇర్ఫాన్, టీ రాము, కానుగంటి శ్రీనివాస్ తదితరుల ఇళ్ళకు వెళ్లి ఆదివారం వేకువజామునే పోలీసు నిఘా ఏర్పాటు చేశారు. పోలీసు వాహనాలు ఏర్పాటు చేసి తమ ఇళ్ల నుండి బయటకు వెళ్లకుండా చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్ కు తరలించి నిర్బంధించారు.







