
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ లోని ఉషోదయ హై స్కూల్ ఎస్సెస్సి 2004-2005 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం స్థానిక హుజురాబాద్ క్లబ్ లో జరిగింది. ఈ సందర్భంగా నాటి తీపి జ్ఞాపకాలను పంచుకున్నారు. నాటి ఉపాధ్యాయులు తమ విద్యా బోధన, స్టూడెంట్స్ చేసిన అల్లరి పనులు, ఇతర అంశాలను నెమరు వేసుకున్నారు. అనంతరం గురువులను శాలువాలు, పూల మొక్కలతో సత్కరించారు. కార్యక్రమంలో కరెస్పాండెంట్ మండల వీరస్వామి, ఉపాధ్యాయులు షేక్ మీరా, గునిగంటి శ్రీనివాస్, చిలుకమారి సత్యరాజ్, తౌటం గోపాల్, మాసాడి వెంగల్ రావు, గునిగంటి మహేందర్, లలిత్ ఆచార్యులు, రవీందర్, బి తిరుపతి, మండల వెంకటేశ్వర్లు, రేణుక, శ్రీనివాసాచారి, స్టూడెంట్స్ సంజీవ్, జ్యోతి, దేవిక, ప్రదీప్, రమేష్, భిక్షపతి, నాగరాజ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

