
మండల యాదగిరి,స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ ఏరియా ఆసుపత్రి లాప్రోస్కోపీ సర్జన్, జమ్మికుంట ఆసుపత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ పారుపేల్లి శ్రీకాంత్ రెడ్డి సేవలు పేద ప్రజలు ఎన్నటికి మరువలేనివని తెలంగాణ యూత్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్వి అర్జున్ పేర్కొన్నారు. బుధవారం డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఎస్ఆర్ ఆస్పత్రిలో శ్రీకాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చేత కేక కట్ చేసి కేకు తినిపించి, ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి శాలువా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి మారుమూల గ్రామం నుంచి పేద కుటుంబం నుండి వైద్యుడిగా ఎదిగి, ఎంతోమందికి నిస్వార్ధంగా సేవలందిస్తూ.. పేద ప్రజల ప్రాణాలు రక్షిస్తున్న గొప్ప వైద్యుడు అన్నారు. ఎంతోమందికి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని తక్షణమే స్పందించి సరైన సమయంలో సరైన వైద్యం అందించి ప్రాణాలు రక్షించిన పేదల వైద్యుడు శ్రీకాంత్ రెడ్డి అని కొనియాడారు. అలాంటి వైద్యుడు శ్రీకాంత్ రెడ్డి నిండా నూరేళ్లు జీవించి పేద ప్రజలకు మరెన్నో సేవలందించాలని ఆకాంక్షించారు.

