
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధులు హుజురాబాద్: హుజురాబాద్ పట్టణ కేంద్రంలో ఇటీవల కోతులు దాడి చేయగా దినసరి కూలి రాధ (55) అనే మహిళ చేయి విరిగి తలకి తీవ్ర గాయాలయ్యాయి. రోజువారి కూలి పనికి వెళ్లి ఇంటికి వచ్చి తమ ఇంటి వద్ద పనులు చేసుకుంటుండగా అకస్మాత్తుగా కోతుల మంద వెంబడించడంతో పక్కనే ఉన్న మురికి కాలువలో పడడంతో చేతి విరిగి తలకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన చుట్టుపక్కన ఉన్న వారు కోతుల దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళను తొలుత హుజురాబాద్ పట్టణ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వారిని కరీంనగర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. కోతుల దాడిలో గాయపడిన మహిళ రాధా దినసరి కూలీ చేసుకుంటేనే పూట గడిచే పరిస్థితి అని తన చేతి విరగడంతో ఉపాధి కోల్పోయానని రోదనలతో ఆవేదన వ్యక్తం చేస్తుంది. హుజురాబాద్ పట్టణంలో నిత్యం ఏదో ఓ చోట ప్రజలపై కోతులు దాడి చేస్తూనే ఉన్నా పట్టించుకునే వారే లేరని పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారులు కోతులను గ్రామం నుంచి అడవికి తరలించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
