
–మంత్రి పొన్నం, ఎమ్మెల్యే కవ్వంపల్లి, మేడిపల్లి సత్యం ఇతర జిల్లా నేతలకు కృతజ్ఞతలు తెలిపిన సత్య ప్రసన్నరెడ్డి
స్వర్ణోదయం ప్రతినిధి గాంధీభవన్, హైదరాబాద్ జనవరి 16: ఈ రోజు హైదరాబాద్ గాంధీ భవన్ లో ఆల్ ఇండియా మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆల్కా లంబా ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మొగిలి సునీతారావు రెండవ సారి కర్ర సత్యప్రసన్న రెడ్డిని కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియమించి నియామకపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మహిళా జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యప్రసన్న మాట్లాడుతూ నా నియామకానికి సహకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కి, మానకొండూరు ఎమ్మెల్యే, కరీంనగర్ డిసిసి అధ్యక్షులు డా. కవ్వంపల్లి సత్యనారాయణ కి మరియు కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా మహిళా కాంగ్రెస్ బలోపేతానికి ఇంకా తనవంతుగా కృషి చేస్తాను అని అన్నారు.

