
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్ (వీణవంక),జనవరి 23: వీణవంక మండల కేంద్రానికి చెందిన జాతీయ భూమి పాత్రికేయుడు ముద్దెర శ్రీనివాస్ గత నెల డిసెంబర్ 18న తన ద్విచక్ర వాహనం పైన హుజురాబాద్ కు పని నిమిత్తం కుటుంబ సమేతంగా వెళ్తుండగా సింగపూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చేయి, కాలికి తీవ్ర గాయాలై గత నెల రోజులుగా ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి టీం సభ్యులు గురువారం అంకుస్ పల్లి లోని తన స్వగృహంలో పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని ఆయనను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వ్యవస్థాపక అధ్యక్షులు గోనెల సమ్మన్నముదిరాజ్, ,ప్రధాన కార్యదర్శి ముద్దసాని శ్రీనివాస్, సభ్యులు దరిపెల్లి మురళి, రాయణవేణి కుమార్, గంధం సుమన్, దూలం సురేష్ పాల్గొన్నారు. అలాగే జాతీయ భూమి సీఈవో పంతాటి రవీందర్, తెలుగు భూమి సీఈవో రషీద్ మహమ్మద్ తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు.

