
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలో తయారయ్యే అనూష్ నెయ్యిలో ఎలాంటి కల్తీలేదని తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు తేల్చి చెప్పారు. హుజురాబాద్ లో తయారయ్యే అనూష్ నెయ్యి కేంద్రాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవల తనిఖీ చేసి అక్కడినుండి శాంపిల్స్ తీసుకొని హైదరాబాదులోని ల్యాబ్ కు పంపించారని నిర్వాహకుడు సోమవారం తెలిపారు. అన్ని పరీక్షల అనంతరం నెయ్యిలో ఎటువంటి హానికర పదార్థాలు లేవని, హానికర ఫుడ్ కలర్ వినియోగించడం లేదని, ఫుడ్ సెఫ్టీ నిబంధనలకు లోబడే నెయ్యి తయారీ జరుగుతున్నట్టు అధికారులు ధ్రువీకరించి ధ్రువీకరణ పత్రాలను చేశారు. ఈ సందర్భంగా అనూష్ నెయ్యి యజమాని నాగేశ్వర్ రావు విలేకరులతో మాట్లాడుతూ.. గత ముప్పై సంవత్సరాలుగా వినియోగదారులకు నాణ్యమైన నెయ్యి అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి నిజాయితీగా నెయ్యి తయారు చేస్తూ వినియోగదారులకు సరసమైన ధరలలో విక్రయిస్తున్న అనూష్ నెయ్యిపై గిట్టని వారు దుష్ప్రచారం చేయడం తగదన్నారు. గతంలోనే హుజురాబాద్ నుండి న్యూఢిల్లీలో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ఇంటికి సైతం తమ నెయ్యిని తీసుకువెళ్లి వాడారని ఆయన గుర్తు చేశారు. ఇంకోసారి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుందని నాగేశ్వరావు హెచ్చరించారు. ఇప్పటికైనా కొందరు తమ నెయ్యి పై దుష్ప్రచారం మానుకోవాలని నాగేశ్వరరావు సూచించారు.



