Oplus_131072
కుమార్ యాదవ్, స్వర్ణోదయం రిపోర్టర్ జమ్మికుంట: వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ సంస్థ కరీంనగర్ జిల్లా కార్యదర్శి గా జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామానికి చెందిన అంబాల రాజ్ కుమార్ ను వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ సంస్థ ఫౌండర్ /ఛైర్మెన్ డా.నలమాస శ్రీకాంత్ గౌడ్ ఆదివారం హనుమకొండ రాధా గార్డెన్స్ లో జరిగిన రాష్ట్రస్థాయి సమావేశంలో కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అంబాల రాజ్ కుమార్ మాట్లాడుతూ వినియోగ దారుడిని మేల్కొలిపే దిశగా పని చేయాలని, ప్రజలను అప్రమత్తం చేసేలా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన కోరారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర కమిటీ సభ్యులకు అంబాల రాజ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.






