
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ (సంగారెడ్డి) సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మెదక్, నిజామాబాద్, అదిలాబాద్, కరీంనగర్ జిల్లాల నాయకుల సమక్షంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గెలుపు కోరిన బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్. తెలంగాణ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ తూర్పు నిర్మల జయప్రకాశ్ రెడ్డిని ఘనంగా శాలువాతో సన్మానించి విత్ డ్రా నామినేషన్ ఫామ్ ను అందజేసిన సందర్భంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులతో మాట్లాడుతూ… తెలంగాణ యూనివర్సిటీ, సిద్దిపేట ఓయూ పీజీ కాలేజీలో, మరియు మెదక్, నిజాంబాద్, అదిలాబాద్, కరీంనగర్, జిల్లాలలో గ్రాడ్యుయేట్స్ పరిస్థితులు తినడానికి తిండి లేక, సరైన మౌలిక వసతులు లేక బాధపడుతున్న పట్టభద్రుల యోగక్షేమాల కోసం నాడు ఫిబ్రవరి 10న కరీంనగర్ జిల్లాలో స్వతంత్ర అభ్యర్థిగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేయుటకు నామినేషన్ విజయవంతంగా దాఖలు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని దృష్టిలో ఉంచుకొని, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాశ్ రెడ్డి నాయకత్వాన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని పట్టభద్రుల సంక్షేమం కోసం ఉపయోగించుటకు, అహర్నిశలు పట్టభద్రుల సమస్యలు పరిష్కరించుటకు బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గెలుపు కోసం విత్ డ్రా చేసిన నామినేషన్ పత్రాన్ని తెలంగాణ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ తూర్పు నిర్మల జయప్రకాశ్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంలో మెదక్, నిజమాబాద్, అదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల సమస్యలను పరిష్కరించేందుకు నాలుగు ఉమ్మడి జిల్లాల పర్యటన కొనసాగిస్తామని, అందుకు పట్టభద్రులు అందరూ ఏకతాటిపై ఐక్యతతో కాంగ్రెస్ పార్టీని బలపరిచి మెదక్, నిజమాబాద్, అదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎలక్షన్లో ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మెదక్ పార్లమెంట్ కాంటెస్టెడ్ ఎంపీ జి సాయగౌడ్, ఎమ్మార్పీఎస్ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు కొలుపుల రత్నయ్యమాదిగ, సోషల్ మీడియా ప్రచారకులు జయరాజ్ పాల్గొన్నారు.
