
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: గ్లోబల్ శోటో కాన్ కరాటే డో ఇండియా కరీంనగర్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్కే జలీల్ ఆధ్వర్యంలో కరాటే శిక్షణ పొందుతున్న పలువురు కరాటే విద్యార్థులు రాజన్న సిరిసిల్లలోని కృష్ణసాయి ఫంక్షన్ హాల్ లో ఆదివారం జరిగిన మార్షల్ రాష్ట్రస్థాయి కరాటే చాంపియన్షిప్ కరాటే పోటీలలో హుజురాబాద్ కు చెందిన గ్లోబల్ శోటో కాన్ కరాటే డో ఇండియా విద్యార్థుల ప్రతిభ కనబరిచారు. 12. సంవత్సరాల కేటగిరిలో కటాస్ లో శ్రీ వెన్నెల గోల్డ్ మెడల్, 8 సంవత్సరాల విభాగంలో కటాస్ లో గౌసియా ఫాతిమా గోల్డ్ మెడల్, 15 సంవత్సరాల విద్యార్థినీల విభాగంలో ఆరెంజ్ బెల్ట్ కేటగిరిలో కటాస్ లో జమ్మికుంట మారుతి నగర్ కు చెందిన జున్ను కావ్య గోల్డ్ మెడల్, 13 సంవత్సరాల విభాగంలో కటాస్ లో పి అనుశ్రీ సిల్వర్ మెడల్, 10 సంవత్సరాల విభాగంలో కేటగిరి. G సహస్ర కటాస్ లో గోల్డ్ మెడల్, 13 సంవత్సరాల విద్యార్థుల విభాగంలో వైట్ బెల్ట్ కేటగిరీ రంగాపూర్ గ్రామానికి సిహెచ్ ఆదిత్య వర్ధన్ గోల్డ్ మెడల్, 11 సంవత్సరాలు ఎల్లో బెల్ట్ కేటగిరీలో సిహెచ్ సాయి చరణ్ కటాస్ లో గోల్డ్ మెడల్ సాధించి ఈ ప్రాంతానికి 7
గోల్డ్ మెడల్స్, ఒక సిల్వర్ మెడల్ సాధించడం అభినందనీయమని అన్నారు. రాష్ట్రస్థాయి మార్షల్ కరాటే పోటీలలో పథకాలు సాధిం విద్యార్థినీ విద్యార్థులకు కరాటే నేర్చుకోవడం ద్వారా ఆత్మ కైర్యంతోపాటు స్నేహభావాన్ని పెంపొందిస్తదని అన్నారు.
విద్యార్థిని విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ నేస్తున్నటువంటి ఎస్కే జలీల్ ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు భవిష్యత్తులో స్పార్క్ మార్షల కరాటే పోటీలలో గెలుపొందిన విద్యార్థులను ఒలంపిక్స్ లలో పథకాలు సాధించే దిశగా అడుగులు వేయాలని సూచించారు. కరాటే మాస్టర్ ఎస్కే జలీల్ ఆధ్వర్యంలో హుజురాబాద్ పట్టణం మంచి పేరు తీసుకువస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ మాజీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్,
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్,
అంబేద్కర్ ఉత్సవ కమిటీ చైర్మన్ఎండి ఖాలిద్ హుస్సేన్, జ్యోతిరావు పూలే కమిటీ చైర్మన్ ఉప్పు శ్రీనివాస్, 2వ వార్డ్ మాజీ కౌన్సిలర్ బి యాదిగిరి నాయక్, ప్రముఖ వ్యాపారవేత్త మొహమ్మద్ సలీం, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మేకల తిరుపతి, గోస్కుల మధు, కాంగ్రెస్ మైనార్టీ నాయకులు మొహమ్మద్ తౌఫిక్, న్యూ కాకతీయ స్కూల్ ప్రిన్సిపాల్ బి రాజ్ కుమార్, డైరెక్టర్ టీ గోపాల్, డైరెక్టర్ వెంగళరావు, గ్లోబల్ షోటోఖాన్ కరీంనగర్ జిల్లా అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు అంబాల ప్రభాకర్, సోషల్ మీడియా నాయకుడు తులసి లక్షణామూర్తి తదితరులు విద్యార్థులను అభినందించారు.



