
Oplus_131072
–విద్యాసంస్థలను కాపాడుకునేందుకు ఎమ్మెల్సీ బరిలో
–వ్యాపారస్తునికి నిరుద్యోగ సమస్యలు ఏం తెలుసు
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: విద్యను వ్యాపారంగా చేసుకుని కోట్లాది రూపాయలు కూడా బెట్టుకున్న నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని గ్రాడ్యుయేట్ నిరుద్యోగ జేఏసీ నాయకులు మహమ్మద్ మురాద్ హుస్సేన్ విద్యార్థి, నిరుద్యోగులకు విజ్ఞప్తి చేశారు. హుజురాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మహమ్మద్ మురాద్ హుస్సేన్ మాట్లాడుతూ ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి విద్యను వ్యాపారమయం చేసి అనేక విద్యాసంస్థలను స్థాపించి ఆ సంస్థలను కాపాడుకునేందుకే ఎమ్మెల్సీ బరిలో నిలిచాడని ఆరోపించారు. ఆయన విద్యాసంస్థల్లో చదివిన ఏ ఒక్క విద్యార్థి కూడా కనీసం ఫీజులో రాయితీ కల్పించలేదని మండి పడ్డారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను ఆర్థిక దోపిడి చేస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సేవ చేస్తున్నానని సేవ కోసం వస్తున్నానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆయన సంస్థల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్ కూడా ఎత్తని నరేందర్ రెడ్డి పట్టభద్ర ఎమ్మెల్సీగా ఎన్నికై నిరుద్యోగుల పట్ల ఏ రకంగా పోరాటం చేస్తారని ప్రశ్నించారు. నిరుద్యోగుల పట్ల తనకి చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నిరుద్యోగ భృతి ఇప్పించి ఎమ్మెల్సీ ఎన్నికల పోటీలో ఉండాలని కోరారు. ఒక వ్యాపారికి నిరుద్యోగ సమస్యలు ఏం తెలుస్తాయని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ నాయకులు పి రేవంత్, రాణా ప్రతాప్, అంజన్ కుమార్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
