
–ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం సంతోషం.
–అంగరంగ వైభవంగా వివాహ వేడుకలు.
–నాన్న పేరు మీద ఆన్నా చారిటబుల్ ట్రస్టు సేవలు చేయడం గొప్ప విషయం.
కుమార్ యాదవ్, స్వర్ణోదయం రిపోర్టర్ జమ్మికుంట (ఇల్లందకుంట) నిరుపేద కుటుంబాలకు చెందిన వారికి వివాహ వేడుకలు జరపడం మంచి కార్యక్రమమని,ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం ఆనందాన్ని కలిగించిందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.ఇళ్ళందకుంట మండలంలోని అపర భద్రాద్రిగా పేరుగాంచిన శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో పదకొండు మంది జంటలకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, పీసీసీ సభ్యుడు పత్తి కృష్ణారెడ్డి-అనిత దంపతులు అన్నా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సామూహిక వివాహాలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి వోడితల ప్రణవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పత్తి కృష్ణా రెడ్డి నాన్న పేరు మీద అన్నా చారిటబుల్ ట్రస్టు ఏర్పాటు చేసి నిరుపేద కుటుంబ సభ్యులకు వివాహ వేడుకలు జరిపించడం గొప్ప విషయమని,ఈ ట్రస్టు ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు జరపాలని ట్రస్టు నిర్వాహకులను కోరారు. ఈ సందర్భంగా ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన కృష్ణారెడ్డి దంపతులను ప్రణవ్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
పేద వాడికి కష్టం వస్తే అన్నా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవలు.. పత్తి కృష్ణారెడ్డి
పేదవాడికి కష్టం వస్తే అన్నా చారిటబుల్ ట్రస్టు ద్వారా సేవలు చేస్తామని పీసీసీ సభ్యులు కృష్ణారెడ్డి అన్నారు.సామూహిక వివాహాల అనంతరం ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఉచిత అంబులెన్స్ సౌకర్యంతో పాటు,వేసవి దృష్ట్యా పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో మంచినీటి సరఫరా చేస్తామని తెలిపారు.ట్రస్టు ఏర్పాటుకు కృషి చేసిన కుటుంబ సభ్యులకు, సహకరిస్తున్న హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కు,ఇతర పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు.










నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్న కాంగ్రెస్ నేత ఓడితెల ప్రణవ్, పత్తి కృష్ణారెడ్డి ఇతర కాంగ్రెస్ నాయకులు.