
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: వంటగ్యాస్ ప్రమాదాల నివారణకు గ్యాస్ వాడకందారులు మరింత అవగాహన కలిగివుండాలని తెలంగాణ యల్పీజి డీలర్ల సంఘం అధికార ప్రతినిధి, అంబుజా గ్యాస్ ఏజన్సీస్ అధినేత పి.వి.మదన్ మోహన్ కోరారు. శనివారం సాయంత్రం హుజూరాబాద్ క్యాంప్ ప్రాంతంలోని మైనారిటీల ఆశ్రమ పాఠశాలలో ఐఓసియల్ దేశవ్యాప్తంగా చేపట్టిన “ప్రేరణ” కార్యక్రమంలో భాగంగా వంటగ్యాస్ వాడకం జాగ్రత్తలు అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. తరచుగా జరిగే
వంటగ్యాస్ ప్రమాదాలు కేవలం వాడకందారుల అవగాహన లోపం వల్ల జర్గుతున్నాయని తెలిపారు. దైనందిన జీవితంలో యల్పీజి వాడకం ఒక భాగమని వాడే విధానంలో మరింత అవగాహన అవసరమని సూచించారు. విద్యార్థులకు గ్యాస్ వాడకంపై అవగాహన కలిగితే ఈ అంశాన్ని తమ కుటుంబీకులకు చేరేవేసే అవకాశాలు వున్నందున ప్రేరణ ద్వారా వంటగ్యాస్ భద్రత ప్రమాదాల నివారణ కార్యక్రమాలు విద్యార్థులకు అందిస్తున్నామని ఆయన తెలిపారు. వంటగ్యాస్ రాయితీ పొందేవారు కచ్చితంగా ఈకేవైసి గ్యాస్ అఫీసు వద్ద లేదా ఇండియన్ ఆయిల్ సైట్ ద్వారా చేసుకోవాలని కోరారు.
గ్యాస్ లీకేజి సమస్యలకు 1906 (24×7 ) టోల్ ఫ్రీ నంబరుకు ఫిర్యాదు చేయాలని నాణ్యత ప్రమాణాలు లేని రబ్బరు ట్యూబ్ వాడరాదని ఐదు సంవత్సరాల కాలపరిమితి గల సురక్ష రబ్బరు ట్యూబ్ వాడాలని దీనిపై తయారీ తేది కాలపరిమితి తేది ముద్రించబడి వుంటుందని తెలిపారు. కాలపరిమితి దాటిన రబ్బరు ట్యూబ్ స్థానే నూతన రబ్బరు ట్యూబ్ కొనగోలు చేసి ప్రమాద భీమాకు అర్హత పొందాలని ఆయన కోరారు.
వంటగదిలో తప్పక కిచెన్ ప్లాట్ పాం,సిరియైన వెలుతురు,గాలి పోయేందుకు వీలుగా కిటకీలు వుండాలని, మండే వస్తువులను వంటగదిలో వుండరాదని, గ్యాస్ లీకేజి సమయంలో విద్యుత్ పరికారాలను వాడరాదని తెలిపారు. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వంటగ్యాస్ మంటలు సంభవించే సందర్భంలో దానిని నియంత్రణ కొరకు ఫైర్ లెర్క్ సాంకేతిక పరిజ్ఞాన సంస్థ ఆమోదంతో బ్రాండ్స్ డాడీ అగ్నినియంత్రణ పరికరాన్ని అందుబాటులోకి తెచ్చిందని దానిని విధగా కస్టమర్లు కలిగివుండాలని ఇరవై నాలుగు వందల రూపాయల ఈ పరికరం వేయి రూపాయలకు ఇండేన్ కస్టమర్లకు అందిస్తున్నామని దీనిని రెగ్యలేటర్ వద్ద అమర్చాలని కాలపరిమితి ఐదేళ్ళు…దీని ఆ కంపనీ ఐదు లక్షల ప్రమాద బీమా వర్తింపచేసినట్టుగా పి.వి.మదన్ మోహన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ముఖ్య సమన్వయకర్త రాము, సమన్వయకర్త ఇమ్తియాజ్, గ్యాస్ మేనేజర్ ఈ దేవేందర్ రెడ్డి, సిబ్బంది శరత్, సాగర్, అన్వేశ్, కుమార్ పాల్గొన్నారు.




