
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలం పేద్దపాపయ్యపల్లి పద్మశాలి సేవా సంఘం కుల పెద్దలను హైదరాబాద్ నిమ్స్ వైద్యుడు, అనుసంధానకర్త డాక్టర్ మార్త రమేష్ శనివారం కలుసుకున్నారు. ఈ సందర్భంగా
పెద్దపాపయ్యపల్లి గ్రామ పద్మశాలి సేవా సంఘం భవనంలో పద్మశాలి కుల పెద్దలను కలుసుకొని వారితో ఆత్మీయంగా పలకరించారు. పద్మశాలి కుల ఐక్యత గురించి వివరించారు. త్వరలో జరగబోతున్న కుల గణన కార్యక్రమంలో అందరూ ఎన్రోల్మెంట్ చేయించుకోవాలని, పద్మశాలీల సంఖ్యాబలం రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకునే విధంగా రాష్ట్రవ్యాప్తంగా పద్మశాలీల పూర్తిస్థాయి ఎన్రోల్మెంట్ జరగాలని అన్నారు. అప్పుడే పద్మశాలిలకు దక్కాల్సిన రిజర్వేషన్ ఫలాలు పూర్తిస్థాయిలో అందుతాయని డాక్టర్ మార్త రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు సంగెం సత్యనారాయణ, ఉపాధ్యక్షులు సంగెం మల్లయ్య, సహాయ కార్యదర్శి కుసుమ రాజమౌళి, లీగల్ అడ్వైజర్ సుంకెన పెళ్లి రాము, గౌరవ సలహాదారులు కొక్కుల రవీందర్, సంగెం వెంకటస్వామి మరియు గ్రామ కుల పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం రాష్ట్ర నాయకుడు డాక్టర్ మార్త రమేష్ ని తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సంగెం సత్యనారాయణ మరియు కుల పెద్దలు శాలువాతో సత్కరించి సన్మానం చేయాగా, సన్మానం చేసిన పెద్దపాపయ్యపల్లి కుల బాంధవులకు డాక్టర్ మార్త రమేష్ కృతజ్ఞతలు తెలిపారు.
