
–కులమతాలకు అతీతంగా సేవ చేసే వ్యక్తిని
–విద్యా సంస్థల అధినేతగా ఎంతో మందిని విద్యావంతులుగా ఉద్యోగులుగా తీర్చిదిద్దాను
–విద్యా దానంతో పాటు ప్రజాసేవకు చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చాను
–సోషల్ మీడియాలో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు
–దుష్ప్రచారం చేసే వాళ్ళు ప్రజలకు ఏం చేశారో చెప్పాలి
–ఓటమి భయంతోనే కుల రాజకీయాలతో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసే వారిని నమ్మి మోసపోవద్దు- నరేందర్ రెడ్డి
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: ఓటమి భయంతోనే కొందరు కుల రాజకీయాలతో పాటు సోషల్ మీడియాలో దుష్ర్పచారం చేస్తున్నారని కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి విమర్శించారు. విద్యాసంస్థల అధినేతగా ఎంతో మందిని విద్యావంతులుగా తీర్చిదిద్దానని ప్రజాసేవకై రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో కలిసి కరీంనగర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో మార్నింగ్ వాక్ తో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. కులమతాలకు అతీతంగా తాను సేవ చేస్తున్నానని తెలిపారు. సోషల్ మీడియాలో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దుష్ప్రచారం చేసే వాళ్ళు ప్రజలకు ఏం సేవ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక్క పేద విద్యార్థిని చదివించారా?…నిరుద్యోగికి ఒక్కరికైనా ఉద్యోగం కల్పించారా అని ప్రశ్నించారు. ఓటమి భయంతోనే కుల రాజకీయాలతో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని, వారిని నమ్మి మోసపోవద్దని పట్టభద్రులను కోరారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఎమ్మెల్సీగా ఆశీర్వదించాలని నరేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.





