
కుమార్ యాదవ్, స్వర్ణోదయం రిపోర్టర్ జమ్మికుంట: జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామానికి చెందిన అయిత రాజ్యలక్ష్మి ఇటీవల గుండెపోటుతో మృతిచెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపిన, కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ వొడితల ప్రణవ్. నినాదం దినపత్రిక హుజురాబాద్ ఆర్ సి ఇన్చార్జ్ రాధాకృష్ణ తల్లి రాజ్యలక్ష్మి ఇటీవల గుండెపోటుతో మృతిచెందగా శనివారం వారి నివాసానికి వెళ్లి రాజ్యలక్ష్మి చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాజ్యలక్మి మృతి ఆ కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మృతురాలి కుమారులు రాధాకృష్ణ, వేణుగోపాల్, భర్త అయిత సత్యనారాయణతో పాటు కాంగ్రెస్ పార్టీ జమ్మికుంట పట్టణ అధ్యక్షులు సుంకరి రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ పుల్లూరి స్వప్న సదానందం, హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొల్లూరు కిరణ్, జమ్మికుంట యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు రాచపల్లి సాగర్, కాంగ్రెస్ నాయకులు రాచపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.



