
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: కాకినాడలో జరుగుతున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్లో.. తెలంగాణ సెక్రటేరియట్ హాకీ టీం డాక్టర్ స్వామి నేతృత్వంలో హోరాహోరి పోరులో మధ్యప్రదేశ్ జట్టుపై నాలుగు-మూడు స్కోర్ తో ఘనవిజయం సాధించింది. 3-3 స్కోర్ తో డ్రాగ ముగుస్తున్న సమయంలో చివరి నిమిషంలో కృష్ణ చక్కటి పాస్ ఇవ్వడం తో జనార్ధన్ మెరుపులాంటి గోల్ సాధించి తెలంగాణ గెలుపుకు ముందున్నారు. జనార్ధన్ రెండు గోల్స్, సాయి సుందర్ రెండు గోల్స్ సాధించి జట్టు గెలుపులో ముందున్నారు. తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్య వహిస్తున్న క్రీడాకారులు, రాజేష్, మన్యం, యూసుఫ్ ,బాలకిషన్, సునీల్, నర్సింగ్, శరత్, రాము, షబ్బీర్ , రవీందర్, శ్యాంసుందర్, ఖురేషి, రాహుల్, శ్యామ్, తెలంగాణ హాకీ టీం అభినందించారు. తెలంగాణ సెక్రటేరియట్ అధ్యక్షులు గిరి శ్రీనివాస్ రెడ్డి, స్పోర్ట్స్ సెక్రటరీ వంశీధర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ ప్రేమ్, టీం మేనేజర్ లేడ్ల నరేష్, కుమార్, టీం కొచ్ కేంబసారం, ఆనంద్ కుమార్ లు అభినందించారు.