
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: బిజెపి హుజురాబాద్ పట్టణ అధ్యక్షులు తుర్పాటి రాజు ఆధ్వర్యంలో బిజెపి బలపరిచిన కరీంనగర్ నిజామాబాద్ అదిలాబాద్ మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాంగోపాల్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ మెంబర్ రావుల వేణు, ,బిజెపి పట్టణ మాజీ అధ్యక్షులు గంగిశెట్టి రాజు పట్టభద్రులను అభ్యర్థించారు. కాంగ్రెస్ బిఆర్ఎస్ కుమ్మక్కై ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, బిఆర్ఎస్ అందుకే అభ్యర్థిని బరిలో నిలుపలేదని పేర్కొన్నారు. దేశంలో మోడీ హవా నడుస్తుందని, రాష్ట్రంలో కూడా రానున్నది బిజెపి ప్రభుత్వమేనని అందుకే ఎమ్మెల్సీగా అంజిరెడ్డిని గెలిపించి బిజెపికి మద్దతు తెలిపాలని పటభద్రులను కోరారు. బిజెపి అభ్యర్థి గెలిస్తే ఉద్యోగ నిరుద్యోగుల సమస్యల నరుమూలనకు ఏ విధంగా కృషి చేస్తారో వివరిస్తూ రూపొందించిన కరపత్రాలను పట్టభద్రులకు ఉద్యోగులకు అందజేసి ఓటు అభ్యర్థించారు. ఈ ప్రచారంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు, సీనియర్ నాయకులు నల్ల సుమన్, యాంసాని శశిధర్, గంగిశెట్టి ప్రభాకర్, యాళ్ళ సంజీవరెడ్డి, అంకతి వాసు, గంట సంపత్, కొలిపాక వెంకటేష్, క్యాస వెంకటేష్, ఉమాశంకర్, పర్థం రాము, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


