
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: మున్సిపల్ కార్మికుల స్థానిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ హుజురాబాద్ కమిషనర్ కే సమ్మయ్యకి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వినతిపత్రం అందజేశారు. హుజురాబాద్ మున్సిపల్ కార్మికులు తమ స్థానిక సమస్యలు ప్రతినెల 5వ తారీఖు లోపు జీతాలు వేయాలని, విలీన గ్రామాల ఆరు నెలల 18 రోజుల జీతాలు, గత సంవత్సరం మే నెలలో ముఖ్యమంత్రి కార్మికులకు వెయ్యి రూపాయల వేతనం పెంచినవి ఏరియార్ రూపంలో ఇవ్వాలన్నారు. ఆటో డ్రైవర్లకు కార్మికుల వేతనం ఇస్తున్నారని, డ్రైవర్ వేతనంలు ఇవ్వాలని, ఈపీఎఫ్ ఈఎస్ఐ క్లియర్ చేయాలన్నారు. బట్టలు, సబ్బులు, బెల్లం, చెప్పులు, కొబ్బరి నూనె ఇవ్వాలని, మరణించిన వారికి ఈపీఎఫ్ ఇవ్వాలని, అర్హులైన కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఒక పూట పని పెట్టాలని, కార్మికులు వారి స్థానిక సమస్యలకు కమిషనర్ సమ్మయ్యకు వినతి పత్రం అందజేశారు. అలాగే మార్చి 4న సమస్యలపై మున్సిపల్ కార్యాలయములో ధర్నా చేయడం జరుగుతుందని, ప్రభుత్వం తమ సమస్యలు తీర్చకుంటే సమ్మెకు సిద్ధమని ఆ వినతి పత్రంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిఐటియు యూనియన్ అధ్యక్షులు ఎండి అజ్జు, ఉపాధ్యక్షులు ఆర్ సరోజన, కోశాధికారి రాజేశ్వరి, ప్రచార కార్యదర్శి బోరగాల కుమార్, సభ్యులు సులోచన, కుమార్, సతీష్, మహేష్, భాగ్య పాల్గొన్నారు.
