
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, ఫిబ్రవరి 23: సిద్దిపేట పట్టణంలో ఆదివారం జరిగిన ఓ వివాహ మహోత్సవంలో విదేశీయులు సందడి చేశారు. సిద్దిపేట పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు కొత్త రాజశ్రీ శ్రీనివాస్ దంపతుల కుమార్తె రోహిణి వివాహం హుజురాబాద్ పట్టణానికి చెందిన పోతిరెడ్డి శ్రీనివాస్ జానకి దంపతుల కుమారుడు రాహుల్ తో జరిగింది. పెళ్లి కుమారుడు రాహుల్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. పెళ్లి కుమారుని తండ్రి పోతిరెడ్డి శ్రీనివాస్ హైదరాబాదు పటాన్చెరులోని ప్రముఖ సంస్థ విజయ్ ఎలక్ట్రికల్స్ లో జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. విజయ్ ఎలక్ట్రికల్స్ జపాన్ లోని ప్రసిద్ధ తోషిబా కంపెనీకి అనుబంధంగా ఉంది. దీంతో శ్రీనివాస్ ఆహ్వానం మేరకు తోషిబా కంపెని ప్రతినిధులు జపాన్ నుండి వివాహ మహోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. అలాగే యూరప్ లోని ఫిన్లాండ్ కు చెందిన యువ జంట కూడా వివాహ మహోత్సవంలో పాల్గొన్నారు. మన సంప్రదాయ దుస్తులు ధరించి.. వివాహ మహోత్సవంలో దాండియా ఆటపాటలతో సందడి చేశారు. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, కట్టుబాట్లు వివాహ పద్ధతి తమకెంతో నచ్చాయని, ఆకట్టుకున్నాయని వారన్నారు. ఇక్కడి వివాహ పద్ధతి తమను మంత్రముగ్ధులను చేసాయని అన్నారు. తమ యొక్క అనుభూతులను ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు. ఈ వివాహం సిద్దిపేటలోని విఎస్ ఎస్ గార్డెన్ లో అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద ఎత్తున ప్రముఖులు ఈ వివాహ మహోత్సవానికి హాజరయ్యారు. డాక్టర్ రమాదేవి- రామచంద్ర రావు దంపతులు, రాజనర్సు, సిరిమల్ల, నాగరాజు, విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ పురమ శ్రీకాంత్, డాక్టర్ ఆది శ్రీదేవి, సబ్ రిజిస్ట్రార్ దేవరం భాస్కర్, సిద్దిపేట మెడికల్ కళాశాల అడ్మినిస్ట్రేటివ్ అధికారి మాడుగుల రామ్ దామోదర్, తహసిల్దార్ పోతిరెడ్డి రవీందర్, ముజామిల్ అహ్మద్ శంశి, యమ్సాని శ్రీనివాస్, హుజురాబాద్ కు చెందిన 1985 బ్యాచ్ పూర్వ విద్యార్థులు పెద్ద ఎత్తున వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించి అభినందనలు తెలిపారు.


