
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలం చెల్పూర్ గ్రామం(తోకలపల్లి)లోని మ్యాకల గంగమ్మ, కదిరే రాజయ్య ఇటీవల అనారోగ్య కారణంతో మరణించగా వారి కుటుంబాన్ని హుజురాబాద్ మాజీ ఎంపిపి ఇరుమల్ల రాణిసురేందర్ రెడ్డి వెళ్లి పరామర్శించి వారికి రూ.5000 చొప్పున ఇరువురి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారు. వారు మృతి చెందిన తీరని వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. వారికి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి రాణిసురేందర్ రెడ్డితో పాటు, మాజీ ఎంపీటీసీ పంజాల సదానందం, మాజీ ఉపసర్పంచ్ జయసుధ వాసుదేవరెడ్డి, కుమారస్వామి, చిరంజీవి, సమ్మయ్య, కొమురయ్య, రాకేష్, సంజీవ్, రాజయ్య, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.







