
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ 41 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని, దుద్దిల్ల శ్రీపాదరావు 88వ జయంతి సందర్భంగా శ్రీపాద సాహిత్య సాంస్కృతిక సేవ పురస్కారాల ప్రధానాన్ని పురస్కరించుకొని శ్రీపాద కళా పురస్కారానికి హుజురాబాద్ పట్టణానికి చెందిన అంతర్జాతీయ కళాకారుడు విష్ణుదాసు గోపాలరావు ఎంపికైనట్లు నిర్వాహకులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గోపాల్ రావు తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో వివిధ కళారూపాలతో తెలంగాణ కీర్తిని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసినందుకు ఆయన కృషిని అభినందిస్తూ శ్రీపాద కళా పురస్కరానికి ఎంపిక చేసినట్లు ఫోక్ ఆర్ట్స్ అకాడమీ నిర్వాహకులు తెలిపారు. ఈనెల 2వ తేదీన కరీంనగర్ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పురస్కారాన్ని ప్రధానం చేయనున్నట్లు వారు తెలిపారు. గోపాల్ రావుకు శ్రీపాద కళా పురస్కారం రావడం పట్ల హుజురాబాద్ కు చెందిన జానపద, నాటకరంగా కళాకారులు, పలువురు అభిమానులు ఆయనకు అభినందనలు తెలిపి హర్షం వ్యక్తం చేశారు.
