
–ప్రజలంతా మన వైపే ఉన్నారు….
–కష్టపడి పని చేస్తే రాబోయే అన్ని ఎన్నికల్లో విజయం మనదే
–కమలాపూర్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
నరేష్, స్వర్ణోదయం రిపోర్టర్ కమలాపూర్: నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల సమస్యలపై పోరాటం చేయాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం హుజురాబాద్ కెసి క్యాంపు లోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమలాపూర్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడవకముందే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలు నెరవేర్చడంలో పూర్తిస్థాయిలో విఫలమయ్యారని అన్నారు. కాంగ్రెస్ పార్టీపై విసుకు చెందిన తెలంగాణ ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయడం లేదని, వాటి అమలు కోసం ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు నిలదీయాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై నిలదీస్తున్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై కేసులు పెడుతున్నారని, ప్రజా ప్రతినిధులను అక్రమంగా అరెస్టు చేసినప్పుడు నియోజకవర్గ మొత్తం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనకోసం కష్టపడిన కార్యకర్తలు, నాయకులకు ఎల్లవేళలా అండగా ఉంటానన్నారు. వారికి ఏ ఆపద వచ్చిన తాను కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. ఇకపై రాబోయే ప్రతి ఎన్నికల్లో నాయకులంతా కష్టపడి పనిచేస్తే విజయం తప్పక మనదే అవుతుందన్నారు. ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలను కూడా ప్రజలకు తెలిసేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అలాగే మార్చి 10వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో వివిధ కమిటీలు వేయాలని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన వారికి అండగా ఉంటూ రాబోయే ఏ ఎన్నికలోనైనా వారందరి కోసం ముందుండి గెలిపించుకునే బాధ్యత తనదని అన్నారు. వేరువేరుగా జరిగిన ఈ సమావేశాల్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తిరుపతి రావు, సత్యనారాయణ రావు, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ ఇంద్రసేనా రెడ్డి, మాజీ జడ్పీటీసీ లు లక్ష్మణ్ రావు, నవీన్ కృష్ణప్రసాద్ మాజీ సర్పంచ్ లు ఎంపీటీసీలతో పాటు కమలాపూర్ మండలంలోని ఉప్పలపల్లి,ఉప్పల్, దేశరజ్ పల్లి, కాన్పర్తి, చంబున్ పల్లి,భీంపల్లి, కన్నూర్, కొత్తపల్లి, గుండేడు, మర్రిపల్లి, మర్రిపల్లిగూడెం, వంగపల్లి, పంగిడిపల్లి, గూడూరు, అంబాల,శ్రీరాములపల్లి, గునీపర్తి, మాదన్నపేట్, శనిగరం, గోపాల్ పూర్, లక్ష్మిపూర్, నెరేళ్ళ, కమలపూర్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


