
Oplus_131072
–హుజురాబాద్ ఉపాధ్యాయులకు “గురు వందనం” …
టీచర్ ఎమ్మెల్సీ మెజార్టీ ఇచ్చినందుకు…
హుజురాబాద్ నియోజకవర్గం ప్రజాప్రతినిధుల ఎంపిక మరియు అభివృద్ధి పై నాదే బాధ్యత..
–కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: హుజురాబాద్ అసెంబ్లీ పరిధిలోని ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రమశిక్షణతో మరియు నిబద్ధతతో పనిచేసిన కార్యకర్తలకు పట్టం కట్టిస్తానని, హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని అభివృద్ధి పైన, ప్రజా ప్రతినిధుల ఎంపిక పైన పూర్తిగా బాధ్యత వహిస్తానని కరీంనగర్ పార్లమెంటు సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కార్యకర్తలకు అభయమించారు. కార్యకర్తలు సమిష్టిగా పనిచేస్తూ టీచర్ ఎమ్మెల్సీ ఓటు వేసిన ప్రతి ఉపాధ్యాయుడు (గురువును) గురు వందనం పేరుతో నమస్కరించాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఓబీసీ మోర్చా కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్, బిజెపి జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు కొలకాని రాజు, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యుడు కోరి రవీందర్, పోలింగ్ బూత్ అధ్యక్షులు పొన్నగంటి రవికుమార్ (పీజేఆర్), ఉడుగుల మహేందర్ తదితరులకు హామీ ఇచ్చారు.
